Home  »  TV News  »  ఇంటిపత్రాల కోసం సేట్ ని కొట్టిన కనకం!

Updated : Jun 22, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -128 లో.. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టిఫిన్ చేస్తుంటారు. అప్పుడే స్వప్న వచ్చి టిఫిన్ చేసేటప్పుడు నన్ను పిలవాలని తెలియదా అని అంటుంది. ఇక్కడ ఎవరు ఎవరిని పిలువరు. అందరు ఈ టైమ్ కి రావాలి. నిన్ను పిలవాలని నువ్వు అనుకుంటే మీ అత్తయ్యని, మీ ఆయన్ని పిలవమని అపర్ణ అంటుంది.

ఆ తర్వాత స్వప్నకి ఇడ్లి పెడుతుంది కావ్య. ఏంటీ ఇన్ని క్యాలరీస్ ఉన్న ఇడ్లీ తింటే బాడీ ఎలా ఉంటుంది. మీలా ఏజ్ కన్న పెద్దగా కనిపిస్తారని స్వప్న అంటుంది. అలా ప్రతీసారీ స్వప్న తన బిహేవియర్ తో చిరాకు తెప్పిస్తుంది. మరొకవైపు  మీనాక్షి  ఇంటిపత్రాలు తీసుకోవడానికి సేట్ ని ఇంటికి తీసుకొని వస్తుంది. ఏంటి డబ్బులు కడుతానని చెప్పి తీసుకొచ్చారు. డబ్బులు కట్టి మీ ఇంటిపత్రాలు తీసుకొండి అని సేట్ అంటాడు. సేటు డబ్బులు లేవు. త్వరలోనే మీ డబ్బు వడ్డీతో సహ కట్టేస్తానని కనకం సేటుని బ్రతిమిలాడుకుంటుంది.

అయిన సేటు వినకపోవడంతో బెదిరించి ఒక కర్రతో సేటు తలపై కొడుతుంది కనకం. సేటు కిందపడిపోతాడు. ఏంటీ ఇలా అయింది. మా ఆయన వచ్చే టైమ్ అయిందని కనకం మీనాక్షి ఇద్దరు సేట్ ని ఒక గదిలో కట్టి ఉంచుతారు. మరొక వైపు దుగ్గిరాల ఇంట్లో ఉండి ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటుంది. స్వప్న బయట కూర్చొని ఉంటుంది. అడిగింది ఇవ్వడానికి పనివాళ్ళు, బోర్ కొట్టినప్పుడు బయటకు వెళ్లడనికి కార్. ఇది కదా నేను కోరుకున్నదని స్వప్న అనుకుంటుంది. అప్పుడే పనిమనిషి చెట్లకు నీళ్లు పోస్తుంటే అక్కడే ఉన్న స్వప్నపై వాటర్ పడుతుంది. అది చూసి పనిమనిషిని తిడుతుంది స్వప్న. అప్పుడే కావ్య వచ్చి అలా మాట్లాడవద్దు. పని వాళ్లకి కూడా గౌరవం ఇవ్వాలని కావ్య చెప్తుంది. కావ్య ఎంత చెప్పిన వినకుండా పొగరుగా మాట్లాడి స్వప్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదంతా పై నుండి రాజ్ చూస్తుంటాడు. స్వప్న అలా తిట్టడం రాజ్ చూసేస్తాడు. అలా రాజ్ చూస్తుండగా కావ్య తనని చూస్తుంది. రాజ్ కి ఎప్పుడు నిజం తెలిసిపోతుందో అనే భయం నాకు వద్దు..తనకి నిజం చెప్పాలనుకుంటుంది.

ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. రాజ్ కోపంగా చూస్తుంటే నిజం తెలిసిపోయినేదేమో అని కావ్య భయపడుతుంది. మీ అక్క గురించి నాకు ఎందుకు చెప్పలేదని రాజ్ అంటాడు. నిజం తెలిసిందని కావ్య ఇంకా టెన్షన్ పడుతుంది. మీ అక్క ఇలా పొగరుగా బిహేవ్ చేస్తుందని నాకు ఎందుకు చెప్పలేదని రాజ్ అంటాడు. మా అక్క ప్రవర్తన గురించి అంటున్నాడా.. ఇంకా నిజం తెలిసిపోయిందేమోనని అనుకున్నానని కావ్య అనుకుంటుంది. చిన్నప్పటి నుండి మా అక్క అంతే అని కావ్య అంటుంది. మరొక వైపు సేటు అరిస్తే బయటకు వినిపించకుండా ఉండటానికి కనకం, మీనాక్షి కలిసి సేట్ నోటికి ప్లాస్టర్ వేస్తారు. కాసేపటికి కృష్ణమూర్తి ఇంటికి రావడంతో సేటు దగ్గర నుండి మీనాక్షి, కనకం ఇద్దరు కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి కంగారుపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.